Panjab MLA: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన తన ఇంట్లోనే మృతి చెందడంపై సందిగ్ధం నెలకొన్నది. తుపాకీ గుండ్లు ఉండటంతో ఎటూ తేల్చలేకపోతున్నారు.
Panjab MLA: తన ఇంట్లోనే గన్‌షాట్‌కు గురైన ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీని కుటుంబ సభ్యులు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. అయితే ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది తేలాల్సి ఉన్నది.
ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ తలలో రెండు బుల్లెట్లు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదవ శాత్తు తుపాకీ పేలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

