Pani puri offer: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్ గురించి మనకు తెలుసు. అలాగే, కొన్ని హోటళ్లలో కూడా నెలవారీ లేదా వార్షిక చందా చెల్లించి ఆహారం తినే అవకాశముంటుంది. అయితే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక పానీపూరీ వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు.
పానీపూరీ ప్రియులను ఆకర్షించేందుకు విజయ్ అనే వ్యాపారి ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించాడు. ఇకపై ప్రతి సారి డబ్బులు చెల్లించే అవసరం లేకుండా, నెలవారీ, వార్షిక లేదా జీవితాంతం చెల్లించే సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
వినూత్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
జీవితాంతం ఉచిత పానీపూరీ: రూ.99,000 చెల్లించి లైఫ్‌టైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, ఎప్పుడైనా, ఎన్ని పానీపూరీలైనా తినొచ్చు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు.
151 పానీపూరీలు తింటే రివార్డ్: ఒకే సారి 151 పానీపూరీలు తింటే రూ.21,000 బహుమతిగా పొందొచ్చు.’మహాకుంభ్’ ఆఫర్: ఒకే సారి 40 పానీపూరీలు తింటే కేవలం రూ.1 మాత్రమే చెల్లించాలి.’లాడ్లీ బెహెన్ యోజన’: మహిళలు రూ.60 చెల్లించి ఎంత పానీపూరీ కావాలంటే అంత తినొచ్చు.నెలవారీ సబ్‌స్క్రిప్షన్: రూ.195 చెల్లించి నెల మొత్తం అన్‌లిమిటెడ్ పానీపూరీలు తినే అవకాశం.ఈ వినూత్న ఆఫర్లతో పానీపూరీ ప్రియుల ఆసక్తిని పెంచేందుకు విజయ్ చేసిన ప్రయోగం సక్సెస్ అవుతుందేమో చూడాలి!