Pakistan

Pakistan: రికార్డు సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్

Pakistan: అంతర్జాతీయ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో కువైట్‌ను 43 పరుగుల భారీ తేడాతో ఓడించి, రికార్డు స్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో హాంకాంగ్ సిక్సెస్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఆరు ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఇది సిక్సెస్ ఫార్మాట్‌లో ఒక భారీ స్కోరు. అబ్బాస్ అఫ్రిది (కెప్టెన్) కేవలం 11 బంతుల్లో మెరుపు వేగంతో 52 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. అబ్దుల్ సమద్ కూడా ధాటిగా ఆడి 13 బంతుల్లో 42 పరుగులు సాధించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

ఇది కూడా చదవండి: Hockey Player Died: లక్నోలో రోడ్డు ప్రమాదం… జాతీయ హాకీ క్రీడాకారిణి దుర్మరణం!

136 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కువైట్ జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడింది. ఓపెనర్ అద్నాన్ ఇద్రీస్ తొలి ఓవర్‌లోనే 5 సిక్సర్లతో మొత్తం 32 పరుగులు కొట్టి కువైట్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. అయితే, పాకిస్తాన్ బౌలర్లు వెంటనే పుంజుకున్నారు. మహ్మద్ షాజాద్, మాజ్ సదాకత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కువైట్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. నిర్ణీత ఆరు ఓవర్లలో వికెట్లు కోల్పోయి కువైట్ కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

కువైట్ తొలిసారి హాంకాంగ్ సిక్సెస్ ఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించినప్పటికీ, పాకిస్తాన్ అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ముందు నిలవలేకపోయింది. ఈ విజయంతో పాకిస్తాన్ 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను దక్కించుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *