Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి ఉగ్రవాదుల దాడికి వణికిపోయింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు కారులో వచ్చి స్థానిక కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలాన్ని భద్రతా దళాలు పూర్తిగా ముట్టడి చేశాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. దాడి వెనుక ఉన్న ముష్కరుల గుర్తింపు కోసం విచారణ సాగుతోంది. ఈ ఘటనతో ఇస్లామాబాద్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

