Pakistan: తన ప్రవర్తనను బట్టి.. తనపైన ఇతరుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.. అన్న సూక్తి పాకిస్థాన్‌కు సూటిగా వర్తిస్తుంది. భారతదేశంలో తొలి నాళ్ల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండగా, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తాలిబన్ ఆధిపత్యంలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌తో కూడా వైరం తెచ్చుకొని నిరంతరం వైరుధ్యంతో పాకిస్థాన్ దేశం అట్టుడుకుతున్నది.
Pakistan: ఈ దశలో పాకిస్థాన్ చేపడుతూ వస్తున్న ఉగ్రవాద వైఖరి అఫ్ఘానిస్థాన్ రూపంలో తిరిగి తనకే తగులుతున్నట్టుగా బుద్ధి చెప్తున్నట్టుగా ఉన్నది. పొరుగు దేశాలైన భారతదేశం, అఫ్ఘానిస్థాన్ దేశాలతో ఉన్న వైరుధ్యాలతో పాకిస్థాన్ దేశ ప్రజలకు నీటి కొరతతో అల్లాడాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకవైపు భారత్ నుంచి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయగా, తాజాగా కునార్ నది నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాకిస్థాన్‌కు రెండు వైపులా నీటి కొరత ముప్పు ఏర్పడింది.
Pakistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధూ నది ఆనకట్ట నుంచి దిగువన పాకిస్థాన్‌కు నీరు సరఫరా కాకుండా నిలిపివేసింది. మరోవైపు బాగ్‌లిహార్ ఆనకట్ట నుంచి పాకిస్థాన్ దేశానికి నీటి సరఫరాను కూడా నిలిపివేసింది. దాయాది దేశాన్ని ఎండగట్టే చర్యల్లో భాగంగా, ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో భారతదేశం ఆరోజుల్లో ఈ రెండు తీవ్ర చర్యలు తీసుకున్నది.
Pakistan: ఇప్పుడు పాకిస్థాన్ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్ఘానిస్థాన్ వంతు వచ్చింది. కునార్ నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని అఫ్ఘానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దేశాల మధ్య వారాల తరబడి జరిగిన ఘర్షణల అనంతరం తాలిబన్ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు భారతదేశం నుంచి మరోవైపు అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి నీటి వనరులు నిలిచిపోవడంతో పాకిస్థాన్‌కు తీవ్ర నీటి ముప్పుతో అతలాకుతలం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార కొరతతో పాకిస్థాన్ అల్లాడాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని చెప్తున్నారు.

