Pak: జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మరోసారి ఉగ్ర దాడికి తెగబడినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌ల దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
దాడి జరిగిన వెంటనే జమ్మూ నగరమంతటా అత్యవసర చర్యలు ప్రారంభమయ్యాయి. బ్లాక్‌అవుట్ ప్రకటించగా, ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలంటూ భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే సైన్యం అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టింది. పాక్ వైపు నుంచి వస్తున్న అనుమానాస్పద డ్రోన్లను భారత బలగాలు లక్ష్యంగా చేసుకుని నాశనం చేశాయి.
ఈ దాడి నేపథ్యంలో భారత సైన్యం ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పై పాకిస్థాన్ విరుచుకుపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ ఈ విధంగా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నప్పటికీ, భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొడుతోంది.
Pak: ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ, రక్షణశాఖ అధికారులు ఈ ఘటనపై సమీక్ష జరుపుతున్నారు. జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలను మరింతగా మోహరించే ప్రక్రియ ప్రారంభమైంది. పరిస్థితిని గమనించి విమానాశ్రయం చుట్టుపక్కల హై అలర్ట్ ప్రకటించబడింది.
ఇప్పటికే పాక్ తరపున మళ్లీ డ్రోన్ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై సంబంధిత శాఖలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి.