Congo: కాంగోలో నదిలో పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 25 మంది చనిపోయారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇనాంగో నగరం వద్ద ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి పెమీ నదిలో 100 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లిన బోటులో జనం ఎక్కువ సంఖ్యలో ఉండడంతో భారీగా ఊగిసలాడింది. ఓ దశలో అనూహ్యంగా నదిలో బోటు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా 25 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: కాస్త పెరిగిన బంగారం ధర.. వెండి లక్ష దగ్గరే!
Congo: సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని నదిలో గల్లంతవుతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చింది. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి 25 మృతదేహాలను వెలికితీశారు. బోటులో 100 మందికి పైగా ఉన్నారని, ఎంతమంది మునిగిపోయారన్న పూర్తి వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. బోటు ప్రయాణికుల్లో చాలా మంది గల్లంతైనందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గత జూన్‌లో ఇదే దేశంలో పడవ బోల్తా పడడంతో 80 మంది చనిపోయారు.