Missing: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కలకలం రేపుతోంది. నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు పాఠశాలకు వెళ్తొస్తామని చెప్పి మిస్సింగ్ అయ్యారు.అయితే.. విద్యార్థినులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలికగా గుర్తించారు. ఈ ముగ్గురు విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు.
ఇది కూడా చదవండి: Hyundai Creta Electric: ఫుల్ ఛార్జింగ్ తో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెషాలిటీ ఇదే!
Missing: విద్యార్థినుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం అయిన కేసులో ఒకరి ఆచూకీ లభ్యమయ్యింది. నిజామాబాద్ బస్టాండ్‌లో కొండపల్లి శిరీష అనే విద్యార్థిని కనిపించింది. దీంతో పోలీసులు శిరీషను తన కుటుంబసభ్యులకు అప్పగించారు.మిగతా ఇద్దరు అమ్మాయిలు జగిత్యాల వైపు వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు బాలికలు మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.మరోవైపు.. అమ్మాయిల మిస్సింగ్‌తో వారి కుటంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.