Akhanda 2

Akhanda 2: అఖండ 2 డిజిటల్ రైట్స్‌పై ఓటీటీ దిగ్గజాల హై డిమాండ్!

Akhanda 2: అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో బాలకృష్ణ, బోయపాటి కాంబో మరోసారి అఖండ 2తో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది, ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో పాటు జియో హాట్‌స్టార్ కూడా రేసులో ఉంది. నిర్మాణ సంస్థ ఈ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. ఇటీవల ఓ ఓటీటీ సంస్థ ప్రతినిధులు సినిమా రఫ్ కట్‌ను చూసి, శివ భక్తి నిండిన సన్నివేశాలతో ఆకట్టుకున్నారని సమాచారం. నార్త్ ఇండియా ప్రతినిధులు ఈ చిత్రాన్ని దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిన ఈ రోజుల్లో, ఫైనల్ కాపీ సిద్ధం కాకముందే ఇంత ఆదరణ రావడం అఖండ 2 పై ఉన్న క్రేజ్‌ను తెలిపేలా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  War 2: వార్ 2: ఆ సీన్స్ హైలెట్.. గూస్ బంప్స్ పక్కా అంటున్న నిర్మాత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *