Osmania Hospital: హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ఇదే సంవత్సరం జనవరి 31న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తాజాగా విజయదశమి పర్విదినం సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ కే గోవర్ధన్‌రెడ్డి ఆ పనులను ప్రారంభించారు.
Osmania Hospital: ఉస్మానియా దవాఖాన భవన సముదాయ నిర్మాణానికి రూ.1,667 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో ఆనాడు నోటిఫికేషన్ విడుదల చేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ నూతన ఆసుపత్రిలో అధునాతన సదుపాయాలను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Osmania Hospital: ఈ కొత్త భవనం 100 సంవత్సరాల అవసరాలకు తగినట్టుగా ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్, ఫైర్‌స్టేషన్, హెలిప్యాడ్ సహా అత్యంత ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. నిర్దేశిత సమయానికే నూతన ఆసుపత్రి భవనాలను నిర్మాణం పూర్తిచేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా భవనాలు, సదుపాయాలను సమకూరుస్తామని ఎంఈఐఎల్ డైరెక్టర్ కే గోవర్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.