Operation Sindoor: భారత్ ఆపరేషన్ సిందూర్‌పై పలువురు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. మంగళవారం (మే 6న) అర్ధరాత్రి 1.44 గంటలకు ఇండియర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా పాకస్తిన్‌లోని 9 ఉగ్ర శిబిరాలపై మిస్సైళ్లతో మెరుపుదాడులు చేసింది. ఆ 9 శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఉగ్రవాద శిబిరాలపై దాడుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా నిశితంగా పరిశీలించారు. ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు విజయవంతం కావడంతో మోదీ హర్షం వ్యక్తంచేశారు.
ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి: డొనాల్డ్ ట్రంప్
Operation Sindoor: భారత్ ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాల నడుమ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, భారత్, పాక్‌లు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయని పేర్కొన్నారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరని, ప్రపంచానికి శాంతి కావాలని, ఘర్షణలు వద్దని ట్రంప్ హితవు పలికారు.
ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: రాహుల్‌గాంధీ
Operation Sindoor: భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లో జరిపిన ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ ఏకగ్రీవ మద్దతు ప్రకటించిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని తెలిపారు. త్రివిధ దళాల దాడిని ఆయన ప్రశంసించారు. ఇకు ముందు చేపట్టబోయే సాయుధ దళాల చర్యలకు కూడా మద్దతుగా ఉంటామని, జైహింద్ అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
జైహింద్, జైహింద్ కీ సేన: ముఖ్యమంత్రులు చంద్రబాబు, ఆదిత్యనాథ్ మద్దతు
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ సంపూర్ణ మద్దతు పలికారు. తమ సోషల్ మీడియా వేదికలపై జైహింద్ అంటూ చంద్రబాబు నాయుడు, జైహింద్.. జైహింద్ కీ సేనా అని ఆదిత్యనాథ్ పోస్టులు పెట్టారు.
భారత్ మాతాకీ జై : కేంద్ర మంత్రుల స్పందన
Operation Sindoor: పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రులు స్పష్టం ఏశారు. భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయుష్ గోయల్ స్పందించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోస్టు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మేరా భారత్ మహాన్, జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం.. భారత్ మాతాకీ జై అని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు.
ఉగ్రవాదంపైనే భారత్ పోరాడాలి: సీపీఐ నేత నారాయణ
Operation Sindoor: ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్, పాకిస్తాన్ ఉమ్మడిగా పోరాడాలని కోరారు. పాకిస్తాన్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదంపైనే యుద్ధం చేయాలని సూచించారు. టెర్రరిజం వల్ల పాకిస్తాన్ కూడా అంతర్గతంగా నష్టపోతుందని, దానిని ఆ దేశం అంతం చేయాలని కోరారు.
భారతీయుడిగా గర్వపడుతున్నా: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ చర్య పట్ల తాను ఒక భారతీయుడిగా గర్వపడుతన్నట్టు తెలిపారు. ఇది దేశ భద్రతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘట్టం సమస్త భారతీయుల్లో దేశభక్తిని రెట్టింపు చేస్తుందని తెలిపారు. జైహింద్ అంటూ ఎక్స్ ఖాతాలో ముగించారు.