olympics 2036: ఒలిపింక్స్-2036 పోటీల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటి నుంచో ఆసక్తిని చూపుతున్నారు. ఈ మేరకు తమకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రికి, ఒలిపింక్స్ నిర్వాహకులకు తన సమ్మతిని తెలిపారు. భారీ ఖర్చు ఉన్నా తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని క్రీడలను నిర్వహిస్తుందని సుముఖతను వ్యక్తంచేస్తూ వచ్చారు. తమ రాష్ట్ర క్రీడా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తుందని కూడా ఆయన భావిస్తూ వచ్చారు.
olympics 2036: ఈ నేపథ్యంలో గురువారం (ఆగస్టు 28) ఒలింపిక్స్-2036 పోటీల నిర్వహణ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లీలా హోటల్‌లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులైన ఉపాసన కొణిదల, కావ్య మారన్, సంజయ్ గోయెంకా, కపిల్‌దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రాలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.