OG: పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతారం OG సినిమా మార్కెట్‌ను షేక్ చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఎంట్రీ, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో డీల్ అవుతున్నాయి. విశాఖ ఏరియా రైట్స్ రూ. 21.80 కోట్లకు, ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 19.20 కోట్లకు డీల్ అయినట్టు సమాచారం.
Also Read: Spirit: స్పిరిట్: మ్యూజిక్ పనులు ఫినిష్?
ఈస్ట్ గోదావరి రైట్స్‌ను జనసేన ఎంపీ ఉదయ్ బృందం సొంతం చేసుకోగా, గుంటూరు రైట్స్ ఆస్ట్రేలియా వెంకట్ ఖాతాలో పడ్డాయి. సాధారణ రేట్ల కంటే 2-3% ఎక్కువకు ఈ డీల్స్ జరగడం పవన్ స్టామినాను చాటుతోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 150 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నా, OG హైప్ ఇప్పటికే జోరుగా సాగుతోంది.


