OG Day 1 Collections

OG Day 1 Collections: పవన్ కళ్యాణ్ ‘OG’ తొలిరోజు కలెక్షన్స్.. రికార్డుకు అడుగు దూరంలో..!

OG Day 1 Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. ‘RRR’ వంటి సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

కలెక్షన్ల సునామీ:
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ‘OG’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు అన్ని సెంటర్లలో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

ప్రీమియర్స్ + డే 1 కలిపి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు మిస్:
‘OG’ భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కొన్ని ఏరియాల్లో ‘పుష్ప 2’, ‘దేవర’, ‘RRR’ వంటి సినిమాల మొదటి రోజు రికార్డులను అందుకోవడంలో కాస్త వెనుకబడింది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఏరియాల డే 1 (మొదటి రోజు) కలెక్షన్లు (షేర్/గ్రాస్) ఇలా ఉన్నాయి:

ఏరియా                    టాప్ 1 రికార్డు (సినిమా)               ‘OG’ కలెక్షన్స్                  స్థానం
నైజాం                       రూ. 25.40 కోట్లు (పుష్ప 2)            రూ. 24.42 కోట్లు           టాప్ 2
సీడెడ్                       రూ. 12.48 కోట్లు (RRR)              రూ. 10.3 కోట్లు             టాప్ 4
ఉత్తరాంధ్ర                  రూ. 7.70 కోట్లు (పుష్ప 2)              రూ. 6.70 కోట్లు             టాప్ 3
గుంటూరు                 రూ. 7.80 కోట్లు (RRR)                రూ. 6.35 కోట్లు             టాప్ 4
కృష్ణ                         రూ. 5.10 కోట్లు (పుష్ప 2)              రూ. 4.80 కోట్లు             టాప్ 2
నెల్లూరు                     రూ. 3.01 కోట్లు (RRR)               రూ. 2.13 కోట్లు             టాప్ 6
తిరుపతి (గ్రాస్)             OG – రూ. 1.38 కోట్లు                రూ. 1.38 కోట్లు             ఆల్ టైమ్ రికార్డు (ATR)
అనంతపురం (గ్రాస్)       92.94 లక్షలు (దేవర)                  83.3 లక్షలు                   టాప్ 4
విజయనగరం (గ్రాస్)     84.50 లక్షలు (పుష్ప 2)                 74.53 లక్షలు                 టాప్ 2

చాలా సెంటర్లలో కొన్ని రికార్డులను అందుకోలేకపోయినప్పటికీ, కొన్ని ఏరియాల్లో ‘OG’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ముఖ్యంగా తిరుపతిలో ఆల్ టైమ్ రికార్డు (ATR) సృష్టించింది. ఈ సినిమా మరిన్ని రోజులు థియేటర్లలో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *