Odela 2: మిల్కి బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నందితో చేస్తున్న లేటెస్ట్ సినిమా “ఓదెల 2”. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో వస్తుంది ఈ డివోషనల్ చిత్రం. తాజాగా మేకర్స్ నేడు మహాకుంభమేళాలో సాలిడ్ టీజర్ ని 102 ఏళ్ల నాగ సాదు చేతులు మీదగా రిలీజ్ చేశారు.టీజర్ ని మాత్రం ఇంట్రెస్టింగ్ కట్ తో తీసుకొచ్చారని చెప్పాలి. ఒక పక్క థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్ ఇంకో పక్క వాటిని ఎదుర్కొనే దైవ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ఈ టీజర్ లో చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ప్రతీ కట్ కి కూడా అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అఘోరిగా సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తుంది.టీజర్లో మాస్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఈ టీజర్ లో సినిమాటోగ్రఫీ, మేకర్స్ నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ సినిమా సెటప్ లు మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇలా మొత్తానికి ఓదెల 2 టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ అవైటెడ్ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో త్వరలోనే రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
