Sreeleela

Sreeleela: శ్రీలీల సినిమాకి అడ్డంకులు!

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల సినీ ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారుతోంది. తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. హిందీ చిత్రం ఆషికి 3తో కొత్త ఒరవడి సృష్టించాలని భావిస్తోంది. కానీ, ఈ సినిమా షూటింగ్‌లో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Also Read: Kalpika Ganesh : నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది: గచ్చిబౌలి పోలీసులకు కల్పిక తండ్రి ఫిర్యాదు!

శ్రీలీల సినీ కెరీర్ ఊపందుకుంటోంది. ఇటీవల ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ, డాన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నితిన్ ‘రాబిన్ హుడ్’ నిరాశపరిచినా, రాబోయే ‘మాస్ జాతర’పై ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్‌లో ‘ఆషికి 3’తో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా, ఈ చిత్రం అడ్డంకులతో సతమతమవుతోంది. టైటిల్ వివాదం, కథలో సయ్యారాతో సమానత్వం కారణంగా కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేసే పనిలో ఉన్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా? ఇదే సమయంలో కోలీవుడ్‌లో ‘పరాశక్తి’తో శివ కార్తికేయన్ సరసన నటిస్తూ, సుధ కొంగర దర్శకత్వంలో గ్రాండ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతోంది శ్రీలీల.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *