NTR

NTR: బాంగ్లా నేపథ్యంలో ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’!

NTR: థియేటర్లలో రికార్డ్ స్థాయి వసూళ్ళను సాధించిన ఎన్టీఆర్ ‘దేవర’ ఇప్పుడు ఎటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ తో కలసి ‘వార్2’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్  ‘డ్రాగన్’ షూట్ లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం ‘డ్రాగన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ యమ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల హైదరాబాద్ లో ఆరంభం కానుంది. ఎన్టీఆర్ లేని భాగం షూటింగ్ ను డిసెంబర్, జనవరిలో చిత్రీకరిస్తారట. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సెట్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇక ఈ సినిమా బాంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంటున్నారు. కెజిఎఫ్ కి పని చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ‘డ్రాగన్’ కి వర్క్ చేయనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇక ‘డ్రాగన్’ 2026 జనవరిలో విడుదల కానుంది. దీనికి ముందు వచ్చే ఏడాది ‘వార్2’ జనం ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *