NTR: మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవలే ‘దేవర’తో గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హిందీ సినిమా ‘వార్ -2’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత జనవరిలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే మూవీ సెట్స్ పైకి వెళుతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ తమిళ దర్శకుడు, ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Akkineni Family: చైతూ, శోభిత కల్యాణం చూతము రారండీ.. సినీ గెస్టులు వీరేనండీ!
NTR: నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్క్రిప్ట్ ను సిద్థం చేయమని చెప్పాడట. అయితే ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్, హోంబలే ఫిలిమ్స్ పోటీ పడగా… చివరకు ఎన్టీయార్ సితార సంస్థ వైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగే… సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ బ్యానర్ లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తర్వాత చేసే సినిమా ఇదే అవుతుంది.