Nora Fatehi: ఇవాళ ఐటమ్ సాంగ్ చేసే కొందరు స్టార్ హీరోయిన్లు రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తే ఐటమ్ సాంగ్ కు క్రేజ్ వస్తుందని తెలిసిన నిర్మాతలు వాళ్ళ డిమాండ్ కు తలొగ్గుతారు. అయితే తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా… రెండు సినిమాలకు తాను డబ్బులు తీసుకోకుండానే ఐటమ్ సాంగ్స్ చేశానని నోరా ఫతేహీ తెలిపింది. ‘స్త్రీ’ చిత్రంలో ‘కమరియా’ సాంగ్, ‘సత్యమేవ జయతే’ లోని ‘దిల్ బర్’ సాంగ్స్ అలా చేసినవే అని చెప్పుకొచ్చింది. చిత్రం ఏమంటే… ఆ సమయంలో తాను తినడానికి తిండి లేకుండా, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఉన్నానని నోరా ఫతేహీ తెలిపింది. నిజానికి ఈ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి ముందే నోరా ఫతేహీ తెలుగులో ‘బాహుబలి’తో కలిసి ఐదారు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది. అలానే మలయాళ, హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. మరి పర్టిక్యులర్ గా సినిమాలకే తాను రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో!?