Punishment To Staff

Punishment To Staff: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం.. నిల్చునే పని చేయండి సీఈఓ పనిష్మెంట్‌

Punishment To Staff: మనలో చాలామందిని చిన్నపుడు స్కూల్ లో పనిషమెంట్ ఇచేవుంటారు. హోంవర్క్ చేయలేదు అని టీచర్ చెప్పిన పన్ని చేయనప్పుడు, క్లాస్ లో అల్లరి చేసినపుడు,క్లాస్ లో గోడ కుర్చీ వేయమంటారూ  లేదా బెంచ్ మీద నిలబెడతారు.. ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంటాయి. ఇపుడు ఈ విషయం ఎందుకు చెపుతున్నాను అంటే.. నోయిడాలో ఒక్క కంపెనీ సీఈవో తన ఉద్యోగులను 20 నిముషాలు నించోనే పనిచేయాలి అని పనిష్మెంట్ ఇచ్చారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ అథారిటీకి చెందిన కార్యాలయంలో 16 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఈ అథారిటీ సీఈఓ లోకేష్.. పని విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. తమ దగ్గరకు వచ్చే జనాలు ఎక్కువ సేపు ఉండకుండా  తొందరగా వల్ల పని అయిపోయేలాగా చూస్తూవుంటారు. మరీ ముఖ్యంగా వృద్ధులను ఎక్కువసేపు నిలబెట్టకుండా చూడాలని ఉద్యోగులకి చెప్తుంటారు లోకేష్. అందుకోసం ఎక్కడున్న కంపెనీ లోని  ఉద్యోగులని సీసీటీవీ లో గమనిస్తుంటారు. 

ఇది కూడా చదవండి: Beggar: బిచ్చగాడికి బిచ్చమేస్తే జైలుకు పోతారు జాగ్రత్త

Punishment To Staff: అయితే సోమవారం ఒక వృద్ధుడు ఆ అథారిటీకి ఓ పని మీద వచ్చాడు. అయన కౌంటర్ వద్ద నిలబడి ఉన్నాడు. ఎంత సేపు అయినా అతడిని అక్కడి ఉద్యోగులు ఎవరూ పట్టించుకోలేదు.లోకేష్ వెంటనే మహిళా ఉద్యోగికి అయన పని ఏంటిదో చూడామణి చెప్పాడు.పని కాకపోతే ఆ విషయం అతనితో చెప్పమని చెప్పారు. 20నిమిషాల తర్వాత చుసిన ఆ వృద్ధుడు అదే కౌంటర్ దగ్గర ఉండడం చుసిన సీఈఓ. వెంటనే కార్యాలయం వద్దకు వచ్చి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వాళ్ళని 20 నిమిషాల పాటు నిల్చొనే పని చేయాలనీ ఆదేశించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *