Shyamali: బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru), టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) డిసెంబర్ 1న కోయంబత్తూరులోని లింగభైరవి దేవాలయంలో నిరాడంబరంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి వివాహం తర్వాత సోషల్ మీడియాలో పలు చర్చలు, రూమర్స్ వెల్లువెత్తాయి. అయితే, ఈ వివాహంపై రాజ్ మాజీ భార్య శ్యామాలి (Shyamali) తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.
శ్యామాలి తన పోస్ట్‌లో తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. ఎవరితోనూ ఇంటర్వ్యూలు ఇవ్వనని, తన నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు లేదా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలను ఆశించకూడదని చెప్పేశారు. సమంత-రాజ్ వివాహం తరువాత చాలా మంది తనపై జాలి చూపిస్తున్నారని, అయినప్పటికీ ఆమె వాటిని పట్టించుకోవడం లేదని తెలిపారు.
Also Read: Rashmika: రష్మిక-విజయ్ దేవరకొండ ఫిబ్రవరిలో పెళ్లి? రూమర్స్ పై రష్మిక స్పందన
తన పర్సనల్ ఫోకస్ గురువు ఆరోగ్య పరిస్థితిపై ఉందని, ఇటీవల ఆయనకు క్యాన్సర్ ఉంది అని తెలిసిందని. ఆ కారణంగా ఆమె ఆలోచనలో, ప్రార్థనలో గడుపుతున్నారని, అందుకే పత్రికా ప్రతినిధులకు తక్షణ స్పందన ఇవ్వలేనని చెప్పారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను స్వయంగా నిర్వహిస్తున్నట్లు, ఎలాంటి పీఆర్ టీమ్ లేదని కూడా వెల్లడించారు.
శ్యామాలి తన ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. కానీ ప్రస్తుతం వ్యక్తిగత సమస్యల కారణంగా ఎలాంటి వార్తలను అందించలేను. నాపై ఎవరూ సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలి,” అని ఆమె పేర్కొన్నారు. రాజ్ నిడిమోరు 2015లో శ్యామాలి ని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సమంతతో రాజ్ వివాహం తరువాత, శ్యామాలి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

