Nirmal district:ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామం నిరసనలతో అట్టుడుకుతున్నది. నిన్న ఆర్డీవో నిర్బంధంతో ఆందోళన తారస్థాయికి చేరింది. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు ఆర్డీవోను గ్రామస్థుల నిర్బంధం నుంచి విడిపించుకొని వెళ్లారు. అయితే కొందరు రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో బుధవారం మళ్లీ గ్రామస్థులు రగిలిపోతున్నారు. ఊరు ఊరంతా ఒక్కటై గ్రామంలో రోడ్లపైకి వచ్చింది.
Nirmal district:అరెస్టు చేసిన వారిని వాహనాల్లో తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో పోలీసులకు ఎదురుతిరిగారు. పురుగు మందు డబ్బాలు చేతబట్టి, పోలీసుల పైకి రాళ్లు రువ్వుతూ తరిమికొట్టారు. ఒక్కసారిగా ఊరంతా కదిలి రావడంతో పోలీసులు, అధికారులు పరుగులు తీశారు. ఊరి అవతలి వరకు వారిని గ్రామస్థులు తరిమి కొట్టారు.
Nirmal district:ఇండ్లలో నుంచి అందరూ మూకుమ్మడిగా బయటకు వచ్చి గ్రామ రోడ్లపై ర్యాలీలు తీశారు. నినాదాలతో హోరెత్తించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందలాది మంది గ్రామస్థులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ఒప్పుకోబోమంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.