Uttar Pradesh: ఘోర రోడ్డ ప్రమాదం..ఐదుగురు డాక్టర్లు స్పాట్ డెడ్..

Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు.కారు అతివేగంగా వెళ్లి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని డెడ్ బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రాణాలు కోల్పోయిన వైద్యులు సైఫాయి మెడికల్ కాలేజీకి చెందినవారని, లక్నో నుంచి సైఫాయికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ తెల్లవారుజామున 3.43 గంటలకు జరిగిన ఈ ప్రమాదానికి గల అసలు కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ్‌వీర్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold price: గుడ్ న్యూస్ స్థిరంగానే బంగారం ధర.. తులం ఎంతంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *