Nirmal district: నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొందరు కొట్టిచంపిన ఘటనను మరువక ముందే.. నిర్మల్ జిల్లాలో మరో దారుణానికి కొందరు యువకులు ఒడిగట్టారు. ఓ వ్యక్తిని కొందరు యువకులు కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వారి కుటుంబంలోని మహిళలు వారించినా ఆగని యువకులు తీవ్రస్థాయిలో కర్రలతో దాడి చేశారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
Nirmal district: నిర్మల్ జిల్లా తానూరు మండలం జవుల (కే) గ్రామానికి చెందిన సిద్ధిరాం అనే వ్యక్తిపై ఓ ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇటీవల సిద్దిరాం మరో వ్యక్తితో కలిసి మద్యం తాగి గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి బంధువులు సిద్దిరాంపై కర్రలతో దాడికి దిగారు. ఇష్టారీతిన చావ బాదుతుంటే అక్కడే ఉన్న మహిళలు వారించబోయినా ఆ యువకుడు దాడిని ఆపలేదు. తీవ్రంగా గాయపడిన సిద్ధిరాంను అతని బంధువులు బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

