అభిషేక్ బచ్చన్తో డేటింగ్లో ఉన్నట్టు గత కొంత కాలంగా పుకార్లు వస్తున్న నేపథ్యంలో దాస్వీ నటి నిమ్రత్ కౌర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు కూడా తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
అయితే ఈ ప్రచారంతోపాటు తనపై వస్తున్న రూమర్స్ పై తాజాగా నిమ్రత్ కౌర్ స్పందించింది. అభిషేక్ తో తనకున్న బంధంపై క్లారిటీ ఇచ్చింది ఈ భామ. “నేను ఏదైనా చేయగలను. ప్రజలు తమకు ఏమి కావాలో చెబుతారు. అటువంటి గాసిప్లను
ఆపడం లేదు. నేను నా పనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతాను” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే, గత కొంత కాలంగా దాస్వీ మూవీ షూటింగ్ టైంలోని ఓ వీడియో.. అభిషేక్ బచ్చన్, నిమ్రత్ మధ్య ఏదో ఉందన్నట్టు పుకార్లు పుట్టేందుకు కారణమైంది. కానీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మాత్రం 15 ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక అమ్మాయి కూడా ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తమపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టేలా ఐశ్వర్య రాయ్ తన భర్తను ఒక్కరినే ఫాలో అవుతున్నట్టు చూపించింది.