Nimmala ramanaidu: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) మొదలుకానున్నాయి. దాదాపు ఏడాది విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్అసెంబ్లీలో హాజరుకానుండటం రాజకీయంగా ప్రాధాన్యత పొందింది.
ఈ అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ, “ఇన్నాళ్లు అసెంబ్లీకి రాకుండా జగన్ అజ్ఞాతంలోన్నరు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తున్నది ప్రజల కోసం కాదు, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదు. తన పదవి కోల్పోతున్న భయంతోనే ఆయన హాజరవుతున్నారు” అని విమర్శించారు.
అలాగే, “గత ఐదేళ్లుగా జగన్ మోసాలు, దోపిడీ, విధ్వంసమే చేశారు. అందుకే ప్రజలు ఆయన్ను పూర్తిగా తిరస్కరించి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపేశారు. జగన్ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు” అని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.