Hyderabad: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన గడువును ప్రభుత్వం పొడిగించింది. మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సరఫరా చేయడానికి మద్యం ఎక్సైజ్ శాఖ మొదటగా మార్చి 15 వరకు గడువు ఇచ్చింది. అయితే, మరిన్ని కంపెనీలకు అవకాశాన్ని కల్పించేందుకు ఇప్పుడు ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించింది.
ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBC)కి కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు అందినట్లు సమాచారం. మరిన్ని కంపెనీలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఎక్సైజ్ శాఖ సూచించింది.
కొత్త గడువు వివరాలు:
మద్యం, బీరు కంపెనీలకు కొత్త బ్రాండ్ల రిజిస్ట్రేషన్ అవకాశం.
మార్చి 15 గడువు పొడిగింపు – ఇప్పుడు ఏప్రిల్ 2 వరకు అవకాశం.
ఇప్పటి వరకు 39 దరఖాస్తులు TGBCకి అందినవి
తెలంగాణలో మద్యం వ్యాపారానికి ఆసక్తి చూపుతున్న కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

