New Viras: కేరళలో కొత్త వైరస్ వచ్చి సుమారు 20 మంది వరకూ చనిపోయిన విషయాన్ని మరువక ముందే మరో వైరస్ కలకలం రేపుతున్నది. ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నది. పిల్లల్లో ఈ కొత్త వైరస్ వేగంగా సోకుతుందని తెలిసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన ఈ వైరస్‌ను టామోటా వైరస్‌గా గుర్తించారు. ఆ రాష్ట్రంలో పలువురికి ఈ వ్యాధి సోకింది. వారంతా తీవ్ర బాధలను అనుభవిస్తున్నారు.
New Viras: ఈ టమోటా వైరస్ చిన్నారుల్లో వేగంగా విస్తరిస్తున్నదని తేలింది. ఆరు నుంచి 13 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఇది త్వరగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారి పాదాలు, అరికాళ్లు, చేతులు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన భోపాల్‌లోని పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి తీవ్రంగా వ్యాపిస్తున్నది.