Transportation: హైదరాబాద్ శివార్లలో ‘ఫోర్త్ సిటీ’గా రూపొందుతున్న ప్రాంతం నుంచి ఏపీ రాజధాని అమరావతిని కలిపే కొత్త హైవే నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఇటీవల జరిగిన కేంద్ర హోం శాఖ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది:
-
హైదరాబాద్ ఫోర్త్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
-
హైదరాబాద్‌లో రూపొందించనున్న డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్‌కు రైలు మార్గం
ఈ రెండు ప్రతిపాదనలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఫోర్త్ సిటీ నుంచి అమరావతి వరకు హైవే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారు చేయాలని కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Leopards in Balapur: హైదరాబాద్ శివారులో చిరుతల కలకలం.. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారుల ప్రకటన
ఈ హైవే వల్ల రెండు రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ అధికారులు స్పష్టంగా వివరించారు.
ఫోర్త్ సిటీ – అమరావతి మధ్య రవాణా వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టుపై ఏపీ అధికారుల స్పందన కోసం తెలంగాణ అధికారులు ఎదురు చూస్తున్నారు.