VVS Laxman: ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ టీమిండియాకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బోర్డర్- గవస్కర్ ట్రోఫీ కోసం నవంబరు 10-11న ఆసీస్‌కు భారత బృందం బయలుదేరనుంది. అందుకే కోచ్ గౌతం గంభీర్ కు రెస్ట్ ఇస్తున్నారు. సౌతాఫ్రికాకు వెళ్లే కోచ్ బృందంలో సాయిరాజ్ బహతులె, హృషికేశ్ కనిత్కర్, శుభదీప్ హోష్ ఉన్నట్లు బిసిసిఐ వర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా టూర్ లో భాగంగా నవంబర్ 8 న డర్బన్ వేదికగా, 10న కెబహ, 13న సెంచూరియన్, 15న జొహన్నెస్ బర్గ్ వేదికగా నాలుగు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. నవంబర్ 3న సౌతాఫ్రికాకు టీమిండియా వెళ్లనుంది.
ఇది కూడా చదవండి: Chirag Chikkara: చిరాగ్ చిక్కారాకు స్వర్ణం.. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్