Citadel 2

Citadel 2: సమంత యాక్షన్ హైలైట్ గా ‘సిటాడెల్’ ట్రైలర్2!

Citadel 2: సమంత ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘సిటాడెల్: హనీ బన్నీ’ సీరీస్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సమంతకు జోడీగా బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించిన ఈ సీరీస్ కు రాజ్ డికె దర్శకత్వం వహించారు. డి2ఆర్ ఫిలిమ్స్ తో కలసి ఆమెజాన్ ఎం.జి.ఎం స్టూడియో నిర్మించిన ఈ సీరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే తొలి ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సీరీస్ తాజాగా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్స్ సీన్స్ హైలైట్ అవుతున్నాయి. కుమార్తెను కాపాడుకోవటానికి సమంత చేసే సాహసం…. అందుకు అండగా నిలిచిన వరుణ్… వీరిద్దరి యాక్షన్ తో ఈ సెకండ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నటినైన తను బన్నీ పరిచయంతో ఏజెంట్ గా మారిన వైనాన్ని కుమార్తెకు చెబుతోంది హనీ పాత్రధారి సమంత. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ‘వెయిటింగ్ ఫర్ సీరీస్’… అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమెరికన్ సీరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్ గా రాబోతోంది ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఈ సీరీస్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరీ ఈ సీరీస్ సమంతకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో తెలియాలంటే వచ్చే నెల 7 వరకూ ఆగాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bollywood Films: రెండు నెలలు కూడా కాకముందే.. అరడజను ప్లాపులు ఇచ్చిన బాలీవుడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *