Nepal: నేపాల్‌లో జరుగుతున్న వేగవంతమైన రాజకీయ పరిణామాల్లో భాగంగా, దేశానికి తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్-Z నిరసనకారులు ప్రతిపాదించిన సుశీల కర్కి పేరుపై ఆర్మీ, అధ్యక్షుడు, నిరసనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నేపథ్యంలోనే నేపాల్ అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి కొత్త రాజకీయ పరిష్కారం దిశగా అడుగులు వేశారు.
ఇక కాసేపట్లోనే సుశీల కర్కి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల నెలకొన్న అల్లర్లు, నిరసనల మధ్య ఈ పరిణామం నేపాల్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.