Nayanthara: నయన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి. ఇది సీనియర్ హీరోయిన్ గా ఆల్ టైమ్ రికార్డు అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ తర్వాత గోపీచంద్ మలినేని కాంబోలో రాబోయే చిత్రంలో నయనతార పేరు బలంగా వినిపిస్తోంది. ఇది వీరిద్దరి నాలుగో కాంబినేషన్. గతంలో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ హిట్ అయ్యాయి. ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టుకు నయన్‌ను సంప్రదించారు. 40 ప్లస్ ఏజ్‌లోనూ నయన్ అద్భుత ఫామ్‌లో ఉంది. దక్షిణాది అత్యధిక పారితోషికం తీసుకునే నాయికగా దూసుకుపోతుంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’సినిమాకి ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. నయన్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలు ఉన్నాయి. తమిళం 4, మలయాళం 2, తెలుగు 2, కన్నడలో 1 ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో నయన్ దూసుకుపోతుంది.

