Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార మార్పులతో ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు యాడ్స్, ప్రమోషన్లకు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు సినిమా ఈవెంట్లలో సందడి చేస్తోంది. ఇతర సినిమాలను కూడా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sai pallavi: సాయి పల్లవికి ప్రతిష్టాత్మక ‘కళైమామణి’ పురస్కారం
నయనతార ఒకప్పుడు మీడియా, యాడ్స్, సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె తన వైఖరిని మార్చుకుంటూ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్ 2’ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా ఆమె తన నిర్మాత పాత్రను హైలైట్ చేసింది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో తన పాత్రను పరిచయం చేస్తూ ఈవెంట్‌లో సందడి చేసింది. సిద్దు జొన్నలగడ్డ నటించిన ఓ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్‌ను డిజిటల్‌గా లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ శివన్‌తో వివాహం తర్వాత ఆమెకు ఫిల్మ్‌మేకర్ల కష్టాలు అర్థమైనట్లున్నాయి. దీంతో సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొంటూ మీడియాతో మమేకమవుతోంది. గతంలో ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్లకు రానని చెప్పిన నయన్, ఇప్పుడు చిరంజీవితో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటూ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో కనిపించే అవకాశం ఉంది. ఈ మార్పు నయన్‌కు కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతోంది.