Nawazuddin Siddiqui: ఇమేజ్ ని పొందట ఎంత కష్టమో… వచ్చిన దానిని కాపాడుకోవటం అంతకంటే కష్టం. అది తెలియక ఓ నటుడు చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల కాలంలో తారలు పలు బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా వ్యవహరిస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు. అందులో కొన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. అలా ఓ బెట్టింగ్ యాప్ వద్ద డబ్బు తీసుకుని ప్రచారం చేస్తూ చిక్కుల్లో పడ్డాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పోలీస్ యూనిఫామ్ ధరించి మనీ పోకర్ ను ప్రోత్సహించిన ఇతగాడిపై ఓ హిందూ సంస్థ కేసు ఫైల్ చేసింది. ‘బిగ్ క్యాష్’ అనే యాప్ కు పోలీస్ డ్రెస్ లో ప్రచారం చేసి పోలీసుల ప్రతిష్ట దిగజార్చినందుకు నవాజుద్దీన్ తో పాటు ఆ సంస్థ యజమాని అంకుర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని హిందూ జనజాగృతి సమితి ముంబై పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ కి లెటర్స్ రాసింది.
మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1951 ప్రకారం పోలీస్ ల పరువు తీశారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. దీనిని సీరియస్ గా తీసుకోకుంటే పోలీస్ యూనిఫామ్స్ ఉపయోగించి మరినని చట్టవిరుద్దమైన ప్రకటనలు వస్తాయని ఆరోపించింది. కష్టపడి కఠినమైన శిక్షణతో సాధించుకున్న పోలీస్ ఉద్యోగులకు ఆన్ లైన్ జూదం నైపుణ్యాన్ని ఇస్తుందని తెలిపే యాడ్ ను నిషేదించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనజాగృతి సంస్థ కోరింది. ఇదిలా ఉంటే నవాజుద్దీన్ పోలీస్ డ్రెస్ లోనే కాదు డాక్టర్ డ్రెస్ లోనూ ఈ ఆన్ లైన్ యాడ్ ను ప్రోత్సహిస్తూ ప్రకటనలో నటంచటం గమనార్హం. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.