Drugs: అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ ఐదు టన్నుల డ్రగ్స్ ను పట్టుకున్న సంగతి మరువకముందే.. మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కోస్ట్ గార్డ్స్. అరేబియా మహాసముద్రలో నవంబర్ 29న భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.500 కిలోల డ్రగ్స్ ( క్రిస్టల్ మెత్) పట్టుకున్నారు.ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ కలిసి జరిపిన సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇప్పటివరకు పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.
కాగా నవంబర్ 25న అండమాన్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇప్పటివరకు పట్టుకున్న డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది. డ్రగ్స్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.