R. Narayana Murthy: విలక్షణ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నటించి, నిర్మించిన హిందీ చిత్రం ఏ దర్తీ హమారీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఆదివాసీ భూహక్కుల ఇతివృత్తంగా ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణలో అధిక భాగం ఉత్తరాదిలో చిత్రీకరించారు. తెలుగులో ఎన్నో విప్లవాత్మకమైన సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు ఏకంగా హిందీ సినిమాతో జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకోనున్నారు.
R. Narayana Murthy: ఈ మేరకు ఏ దర్తీ హమారీ చిత్రం ప్రీమియర్ షోను నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షోకు పలువురు ప్రముఖులు హాజరై ఆర్ నారాయణమూర్తిని అభినందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాదిరిగానే జాతీయ స్థాయిలో కూడా ఆయన సినిమా విజయవంతమై, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ షోను రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు తిలకించారు. త్వరలో ఆ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి ప్రకటించారు.