Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మోదీని హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కేసులో 34 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహిళ మానసిక స్థితి సరిగా లేదని తేలింది. ఆమె ప్రాంక్ కాల్ చేసినట్టు చెబుతున్నారు. ఆ మహిళకు ఎలాంటి నేర చరిత్ర లేదు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
6 ఏళ్లలో మోదీకి మూడు సార్లు బెదిరింపులు వచ్చాయి. 2023లో హర్యానాకు చెందిన ఒక వ్యక్తి వీడియోను వైరల్ చేస్తూ ప్రధాని మోదీని కాల్చివేస్తానని బెదిరించాడు. వీడియోలో, యువకుడు తనను తాను హర్యానాకు చెందిన కిరాతకుడిగా పరిచయం చేసుకున్నాడు. ప్రధాని మోదీ తన ముందుకు వస్తే కాల్చిపారేస్తానని ఆ వీడియోలో చెప్పాడు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కాకినాడ పోర్టుకు పవన్ .. రేషన్ మాఫియాకు చెక్
Narendra Modi: అలాగే 2022లో ప్రధాని మోదీని జేవియర్ అనే వ్యక్తి బెదిరించాడు. జేవియర్ కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌కు ఈ మేరకు ఒక బెదిరింపు లెటర్ పంపించాడు జేవియర్. ఆ సమయంలో ప్రధాని కేరళ పర్యటనకు వెళుతున్నారు.
ఇక 2018లో మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అల్లావుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానని బెదిరించాడు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌లో సభ్యునిగా చెప్పుకుంటూ దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు చెప్పాడు.