Navratri 2025: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై, ఈ ఏడాది ప్రత్యేకంగా 10 రోజులుగా జరుపుకోవడం విశేషం. ప్రతీ ఏడాది తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు, కానీ ఈ సంవత్సరం ఉత్సవాలను పది రోజులుగా కొనసాగించనున్నారు. ఇప్పటికే ఉత్సవాలు మొదలై నేటికి నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా చాలా మంది ఉపవాసాలు చేసుకుంటారు, అమ్మవారి మాలలు ధరించి పూజలు నిర్వహిస్తారు. అయితే పండితుల సూచనల ప్రకారం, ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల సమయంలో తాంత్రిక శక్తులు ఎక్కువ ఉత్సాహంగా ఉంటాయి, కాబట్టి అపరిచిత ప్రతికూల దృక్సక్తులు కూడా ప్రబలించే అవకాశం ఉంది.
నవరాత్రి ఉత్సవాలలో పాటించవలసిన ముఖ్య సూచనలు
-
స్త్రీలను అగౌరవించవద్దు
నవరాత్రి సమయంలో అమ్మవారు శక్తివంతంగా ఉంటారు. ఎవరో స్త్రీని అవమానిస్తే, దుర్గా మాత ఆగ్రహానికి గురి కావడం మాత్రమే కాకుండా, తన ఆశీస్సులు కూడా అందకపోవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. -
మద్యం, మాంసం వాడకండి
ఉత్సవాల సమయంలో శుద్ధ ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరమని చెప్పబడింది. మద్యం, మాంసం వంటి వస్తువుల నుండి దూరంగా ఉండడం అత్యంత అవసరం. -
అనవసరమైన వస్తువులు ఇతరులకు ఇవ్వవద్దు
వ్యక్తిగత వస్తువులు, బట్టలు, లేదా ఏదైనా వస్తువులు ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంటే జాగ్రత్త. ఇవి ప్రతికూల ఆచారాలకు ఉపయోగించబడే ప్రమాదం ఉంది. -
నల్లటి వస్త్రాలు ధరిచకండి
పండితుల సూచన ప్రకారం, నవరాత్రుల సమయంలో నల్లటి రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ధరిచకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించే అవకాశం ఉందని చెప్పబడింది. -
అపరిచితుల ప్రసాదం, బహుమతులు తీసుకోకండి
నవరాత్రి సందర్భంగా ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి స్వీట్స్, ప్రసాదం, బహుమతులు అందిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోరాదు. అలా చేస్తే అనేక రకాల ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకురావచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: They Call Him OG Review: ఓజీ మూవీ రివ్యూ.. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.. బొమ్మ అదిరిపోయింది..!
జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడం
నవరాత్రి ఉత్సవాలు శక్తి, శుద్ధి, భక్తి మరియు ఆనందానికి ప్రతీక. అందువల్ల ఈ పర్వదినాలలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నెగటివ్ ఎనర్జీ దూరంగా, దైవప్రార్థనలో సమగ్రంగా ఉండటం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలను భక్తితో, శ్రద్ధతో, శాంతితో జరుపుకోవడం అత్యంత ముఖ్యము.
నోట్: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పండితుల సూచనల ఆధారంగా, మత విశ్వాసాల పరంగా అందించబడింది. దీని శాస్త్రీయ ఆధారం లేదు.