Jubilee Hills By Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం వెలువడింది. ఉదయం నుంచి కొనసాగిన హోరాహోరీ కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తొలి రౌండ్ల నుంచే తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్, అధికార బీఆర్ఎస్పై అద్భుతమైన గెలుపును నమోదు చేశారు.

