National:

National: దేశ‌వ్యాప్త రైతుల‌కు శుభ‌వార్త‌..

National: దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి శుభ‌వార్త అందింది. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న‌ కింద కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం ఏటా ఆరు వేల రూపాయ‌ల‌ను ప్ర‌తి రైతు ఖాతాల్లో జ‌మ చేస్తున్న‌ది. విడ‌త‌కు రూ.2,000 చొప్పున ఏటా మూడు విడ‌త‌లుగా ఆ న‌గ‌దును రైతుల ఖాతాల్లో వేస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కూ 20 విడ‌త‌లుగా రైతుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసింది. ఈ ఏడాది ఆగ‌స్టు 2వ తేదీన 20వ విడ‌త పీఎం కిసాన్ ప‌థ‌కం న‌గ‌దు సాయాన్ని రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసింది.

National: పీఎం కిసాన్ 21వ విడ‌త విడుద‌ల‌పై రైతుల్లో ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాక‌పోయినా, పీఎం కిసాన్ 21 విడ‌త నిధుల‌ను అక్టోబ‌ర్‌లోనే దీపావ‌ళి సంద‌ర్భంగా దేశ‌వ్యాప్త రైతుల‌కు రూ.2,000 చొప్పున విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్నది. అక్టోబ‌ర్ 20 లోగానే రైతుల‌కు న‌గ‌దు ప‌డుతుంద‌ని నివేదిక‌లు సూచిస్తున్నాయి. దీంతో ఇదే నెల‌లో న‌గ‌దు సాయం అందుతుంద‌ని రైతుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

National: 2014లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్డీయే ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్త అన్న‌దాత‌ల‌ కోసం ఈ స్కీంను అమ‌లు చేసింది. ఎన్డీయే ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం అమ‌లు చేసిన అన్ని ప‌థ‌కాల్లో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ పొందింది. ఇది రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కారిగా నిలిచింది. పంట‌ల పెట్టుబ‌డి కాలానికి రైతు కుటుంబాల‌కు ఇది సాయ ప‌డుతున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *