Narendra Modi: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న తీవ్ర కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ నిర్వహించిన ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాలలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
శాంతి ప్రార్థనల్లో ఉగ్రవాదంపై స్పందన
ప్రపంచానికి శాంతి మార్గం చూపిన బుద్ధుడి గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఢిల్లీ పేలుడు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఏ ఒక్కడిని వదిలిపెట్టం.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
“ఢిల్లీ ఘటనపై బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తి లేదు. ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తాం. కుట్రదారులను వదిలిపెట్టం, వారిని చట్టం ముందు నిలబెడతాం” అని మోదీ గట్టిగా ప్రకటించారు. ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలని, బుద్ధుడు చూపిన శాంతి మార్గాన్ని అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్-భూటాన్ సంబంధాలు బలోపేతం
ప్రపంచ శాంతి ప్రార్థనల సందర్భంగా ప్రధాని మోదీ భారత్-భూటాన్ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య మైత్రి, సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ పేలుడుకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగవంతం చేశాయి. ప్రధాని మోదీ ప్రకటనతో ఈ కేసులో నిందితుల పట్టుదలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైంది.

