narendra modi

Narendra Modi: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Narendra Modi: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ 97వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజకీయాలకు ఆయన ఎనలేని సేవలందించారని మోదీ కొనియాడారు. అలాగే, ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు ఉండాలని ఆకాంక్షించారు.

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ శుక్రవారం తన 97వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా భారత రాజకీయాలకు పునాదిరాయిగా నిలిచిన అద్వానీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజకీయ రంగానికి ఆయన చేసిన ఎనలేని సేవలను కొనియాడారు.

ఇది కూడా చదవండి: Congress: హర్యానాలో ఓటమిపై కోర్టుకు కాంగ్రెస్!

Narendra Modi: దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ప్రధాని మోడీ భారతదేశం లో అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులలో అద్వానీ ఒకరని కొనియాడారు. దేశాభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి ఆయన అంకితభావాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. “అతని పుట్టినరోజు సందర్భంగా, నేను ఎల్.కె. అద్వానీ జీకి నా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, దేశానికి చేసిన విశేష సేవలకు గాను ఆయనకు భారతరత్న లభించింది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health: ఉడికిన గుడ్డు తినడం వల్ల ఇన్ని లాభాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *