Nara Rohit: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. తనతో కలిసి ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించిన నటి శిరీష లేళ్ల (సిరి)తో ఆయన వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవా టెల్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణంతో వివాహ వేడుకలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారైంది.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 30న రాత్రి 10.35 గంటలకు ఈ జంట వివాహం జరగనుంది. వివాహ వేడుకలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుక, 26న పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ, 29న సంగీత్, అనంతరం 30న ప్రధాన వివాహం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Prabhas: ఎవర్ గ్రీన్ స్టార్…రెబల్ స్టార్ ప్రభాస్
వివాహ వేడుకలు హైదరాబాద్‌లోని తెల్లాపూర్ మండువా ప్రాంగణం, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హల్దీ వేడుకలు మండువా ప్రాంగణంలో జరిగి, మెహందీ వేడుకలు కూడా అక్కడే జరుగుతాయని సమాచారం. ఇటీవలే శిరీష సోషల్ మీడియాలో ‘పసుపు దంచడం’ ఫోటోలను పంచుకోవడంతో పెళ్లి పనులు మొదలయ్యాయని అభిమానులు తెలుసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఉండనున్నారు. వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. నారా కుటుంబంలో పెళ్లి సందడి మొదలవడంతో అభిమానులు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు. నారా రోహిత్ – శిరీష జంట ‘ప్రతినిధి 2’తో పరిచయమై, ఆ తర్వాత ప్రేమలో పడి చివరకు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహ వేడుకలు టాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయమైన స్టార్ వెడ్డింగ్‌గా నిలవనున్నాయి.