Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ నేడు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్పై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే చైర్మన్ దానిని తిరస్కరించడంతో సభలో వాదోపవాదాలు చెలరేగాయి.
వైసీపీ సభ్యులు బిల్లుపై తప్పనిసరిగా చర్చ జరగాలని పట్టుబట్టారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం చర్చకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “కోవిడ్ కాలంలోనే వైసీపీ ప్రభుత్వం రూ.644 కోట్ల బకాయిలు పెట్టింది. ఇప్పుడు బాధ్యతలను ఎక్కుపెట్టడం సరికాదు” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: H1B Visa: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లకు మినహాయింపు?
అదేవిధంగా GST విషయంలోనూ లోకేష్ వైసీపీపై సూటిగా విమర్శలు గుప్పించారు. “GSTపై మీ పార్టీ సభ్యులు అనుకూలమా, వ్యతిరేకమా అనే ప్రశ్న అడిగినా ఎవరూ స్పందించలేదు. శాసనమండలిలోనూ వైసీపీకి సౌండ్ లేదు” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై సభలో రాజకీయ వేడి రాజేసింది. ఒకవైపు వైసీపీ దీనిపై చర్చ తప్పనిసరి అని పట్టుబడుతుండగా, మరోవైపు ప్రభుత్వం గత బకాయిలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై విమర్శలు కురిపిస్తోంది.