Nara lokesh: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. సంఘటన వివరాలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా ఆలయ ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ, బాధితుల పరిస్థితి, రక్షణ చర్యల పురోగతి గురించి అధికారులతో వివరంగా మాట్లాడారు.
అధికారుల నుంచి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్న లోకేష్, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్షణ, వైద్య సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

