Nara lokesh: ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే నిర్ణయించేదని, ఆ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అర్థం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అసెంబ్లీకి జగన్ ఒక్కరోజు వచ్చి వెళతారని, తర్వాత కనిపించరని ఆయన ఎద్దేవా చేశారు.
“జగన్ అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేసినట్లుగా మారిపోయింది. ఆయన తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ను కించపర్చేలా వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. జగన్ వాస్తవాలు తెలుసుకోవాలి,” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
అంతేకాక, ప్రతిపక్ష హోదాను ప్రజలే నిరాకరించారని, అది జగన్ గ్రహించలేకపోతున్నారని లోకేశ్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ నిర్లక్ష్యంగా హాజరవుతున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా లేరని ఆయన ఆరోపించారు.
పవన్ కళ్యాణ్పై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని, కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని, వ్యక్తిగత దూషణలు అవసరం లేదని ఆయన హితవు పలికారు.