Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు గారు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారు.
ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్ కు ఆత్మ చెప్పినట్లుంది.. ఆయనే తీసుకువచ్చాడని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 2014-19 మధ్య 44వేల పరిశ్రమల ఏర్పాటుతో పాటు 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో ఊపుకున్నారాన్నారు. గతంలో జగన్ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తామని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సర్వీసింగ్ ఉత్తరాంధ్రకు తీసుకువస్తామన్నారు. బుక్ ల విషయంలో తనను చూసి ఇన్ స్పైర్ అయినట్లుందని బ్లూ బుక్, గుడ్ బుక్ అంటున్న వైసీపీ చూస్తే నవ్విస్తుందన్నారు. వైసీపీ వేరే పుస్తకాలు పెడితే పెట్టుకోనివ్వండి.. మాకేం భయం లేదని అన్నారు
ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవన్నారు. వరదసాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మేం న్యాయబద్ధంగా వెళ్తామని అన్నారు.జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్లనివ్వండని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజల్లోకి వెళ్లవచ్చని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
గుంటూరులో ఈఎస్ఐ మంగళగిరిలో ఎయిమ్స్ కు నీటి సరఫరాతో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు. మూడు నెలల్లో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడతాని వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామని నారా లోకేష్ తెలిపారు. రోడ్ల నిర్మాణం కూడా త్వరలోనే చేపడతామని అన్నారు.