Nara lokesh: మంత్రి నారా లోకేశ్ తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదు, హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వక దాడి”అని స్పష్టంగా పేర్కొన్నారు.
లోకేశ్ తెలిపిన వివరాలు: సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టిందని అన్నారు. హిందువుల విశ్వాసాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
“ఇది భరతమాత ఆత్మపై జరిగిన నేరం,” అని లోకేశ్ పేర్కొన్నారు. ఇందులో పాలుపంచుకున్నవారెవరికైనా చట్టపరంగా తప్పించుకునే అవకాశం లేదని, వారందరికీ కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
అలాగే పవిత్రమైన విషయాలతో ఆడుకున్న వారు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఆయన అన్నారు.“ఎవరైతే పవిత్రతతో ఆడుకున్నారో వారు తగిన మూల్యం చెల్లించాలి… ఓం నమో వెంకటేశాయ,”అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

