Dulquer Salmaan: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్-3’ మే 1న వేసవి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని హిట్ ఫ్రాంచైజీలో హ్యాట్రిక్ విజయం సాధించేలా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ చిత్రం మలయాళ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిలింస్ బ్యానర్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. కేరళలో దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. హిట్ సిరీస్‌కు అక్కడ ఉన్న క్రేజ్‌తో నాని పర్ఫార్మెన్స్ మలయాళ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ‘హిట్-3’ దుల్కర్ సల్మాన్‌కు, నానికి ఎంతటి లక్ తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Jr NTR: ఎన్టీఆర్ చిక్కిపోవడానికి కారణం అదే!